మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో పరారైన నిందుతుల్లో ముగ్గురు మంగళవారం పట్టుబడ్డారు. నిందుతుడు ఏ -1 గా కిషోర్, ఏ-2 గా పులి, ఏ-3గా చిన్నిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి జైలులోని ప్రత్యేక గదుల్లో ఉంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ టీవీ పుటేజీ, హత్యను చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ముగ్గుర్నీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణకు రంగం సిద్దం చేసారు.
భాస్కరరావు ని చంపడానికి గల కారణాలే ఏంటి? ఈ హత్య వెనుక రాజకీయ నాయకులు ప్రమేయం ఉందా? ఉంటే వాళ్ల కుట్రకు కారణం ఏంటి? సైనేడ్ పూసిన కత్తితో చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వంటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఈ హత్యపై మంత్రి నాని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయ హత్య అని, తనని రాజకీయంగా ఎదుర్కోలే క ఇలాంటి చర్యకు దిగారని సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో ఈ హత్యపై అన్ని రకాల కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ నేతల హస్తం ఉందా? అని అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఏదేమైనా ఈ మర్డర్ వెనుక అసలు వ్యక్తి ఎవరు? అన్నది కొద్ది రోజుల్లో నిగ్గు తేలే అవకాశం ఉంది.
మచిలీపట్నం మార్కెడ్ యాడ్ లో ఉన్న మోకా భాస్కరరావుని దుండగులు కత్తితో పొడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఒకరు కత్తి తో పొడిచి..ఆ వెంటనే పరిగుత్తుకొచ్చి బైక్ పై పరారయ్యారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమారాల్లో రికార్డు అయింది. దాని ఆధారంగానే కేసు విచారణ చేపడుతున్నారు. ఇక భాస్కరరావు అంత్యక్రియలు నేడు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే, స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.