Rakesh Tikayat: రాజకీయ నాయకులకు, సెలబ్రెటీలకు బెదిరింపులు ఎదురవడం చూస్తూనే ఉంటాం. ఇక వాటి నుంచి తమ రక్షణకు ఎప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. అలా తాజాగా మరో రాజకీయ నాయకుడు బీకేయూ నేత రాకేశ్ టికాయత్ ను చంపేస్తామంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని మరో బీకేయూ నేత పెర్జివాల్ త్యాగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అంతేకాకుండా ఆయనను ఆ గుర్తు తెలియని వ్యక్తి తిట్టినట్లు ఉత్తర ప్రదేశ్ లో ఆ ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు. ఇక ఎస్సై రాకేష్ శర్మ తో పాటు పలువురు పోలీసుల బృందం టికాయత్ ఇంటికి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం టికాయత్ రైతుల హక్కుల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.