Khiladi Releasing In Hindi : “ఖిలాడి”ని హిందీలో కూడా ఎందుకో కారణం తెలిసిపోయింది!

Khiladi Releasing In Hindi : ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ రెడీగా ఉన్న అవైటెడ్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఖిలాడి” కూడా ఒకటి. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ రెండు పాత్రల్లో నటించగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి లు నటించారు. మరి రవితేజ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ ఫిబ్రవరి 11న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

అది కూడా తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నామని చిత్ర బృందం ఆసక్తికర అప్డేట్ ని అందించారు. అయితే మొదట తెలుగులోనే రిలీజ్ కి ప్లాన్ చేసి లాస్ట్ లో హిందీ రిలీజ్ అని కూడా అనౌన్స్ చెయ్యడం మరింత హైప్ తెచ్చింది. అయితే సడెన్ గా అసలు హిందీ రిలీజ్ ఎందుకో ఇప్పుడు కారణం తెలిసిపోయింది.

ఈ సినిమాకి నిర్మాతలలో బాలీవుడ్ బిగ్ బ్యానర్ పెన్ మూవీస్ వారు కూడా ఉన్నారు. హిందీ రిలీజ్ ఐడియా వారిదేనట. నిజానికి హిందీలో రవితేజ సినిమాలకు మంచి ఆదరణ ఉందని వారికి తెలిసిందట. అందుకే ఖిలాడి ని హిందీలో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారట.

అంతే కాకుండా హిందీలో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయని వారు కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారట. అందుకే ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారని తెలిసింది. అయితే ఈ పెన్ మూవీస్ వారే భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ని కూడా హిందీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఖిలాడి హిందీలో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.