Dhanush : ఇప్పుడు సినీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా మారిన కొన్ని అంశాల్లో మన సినీ తారల వివాహ బంధాలు వారి విడాకులు కోసం కూడా ఒకటి. అయితే గత కొన్ని నెలల కితమే స్టార్ హీరో హీరోయిన్స్ అయినటువంటి సమంతా మరియు అక్కినేని నాగ చైతన్యలు తమ విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇవ్వగా అది మర్చిపోయే లోగా..
మరో స్టార్ కపుల్ అయ్యినటువంటి తమిళ స్టార్ హీరో ధనుష్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ధనుష్ భార్య అయినటువంటి ఐశ్వర్య లు తాము విడిపోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక బంధం నుంచి విడిపోతున్నాం అనేది కాస్త బాధ కలిగించే అంశం అనే చెప్పాలి.
మరి ఇదిలా ఉండగా ఇన్నేళ్ల తర్వాత వీరు విడిపోవడానికి ఓ బలమైన కారణం కూడా ఉండకపోదు కదా అదేమిటి అనేది ఇప్పుడు తెలుస్తుంది. తమిళ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ధనుష్ ప్రొఫిషనల్ లైఫ్ పరంగానే ఈ విడాకులు జరిగాయట.
తనకి ఉన్న సినిమాలు కారణంగా ధనుష్ ఇంటి దగ్గర ఎక్కువ ఉండకపోతుండడం ఐశ్వర్యని తన పిల్లలని కూడా కలవడానికి ధనుష్ అందుబాటులో వుండకపోవడమే వీరి మధ్య దూరాన్ని మరింత తీసుకొచ్చిందట. అందుకే ఇక ఈ ఇద్దరూ విడిపోవడమే కరెక్ట్ అనుకోని ఒకమాట మీదకి వచ్చి అధికారికంగా తమ విడాకులని అనౌన్స్ చేసారని ఇన్సైడ్ టాక్.