“RRR” నుంచి ‘జనని’ లో ఈ విజువల్ అద్భుతం.!

ఇద్దరు మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) నుంచి చిత్ర బృందం ఈరోజు సినిమాలోని పూర్తి భావోద్వేగ పూరిత సాంగ్ ‘జనని’ ని రిలీజ్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

అయితే దీనికి సంబంధించి నిన్ననే ఒక స్పెషల్ స్క్రీనింగ్ ని చిత్ర బృందం వేశారు. సినీ ప్రముఖులు కొందరు దీనిని చూసారు. అయితే ఈ సాంగ్ పై మరింత ఆసక్తికర సమాచారం తెలుస్తుంది. ఈ సాంగ్ విజువల్ గా చాలా బాగుంటుందట. కంప్లీట్ గా విజువల్స్ మాత్రమే ఉంటాయి ఎలాంటి లిరికల్ సాంగ్ ఇది కాదు.

అయితే ఇందులో ఓ సన్నివేశం రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు కి తన భార్య అలియా భట్ బొట్టు పెట్టె సన్నివేశం అద్భుతంగా అనిపిస్తుందట. ఇందులోని సాహిత్యం సందర్భం ఆ సన్నివేశానికి మరింత ఎలివేట్ చేసేలా ఉంటుందట. మరి ఈ సాంగ్ కంప్లీట్ గా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు వేచి చూడాల్సిందే.