అనుకోని రీతిలో బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపిన తమిళ్ సినిమా.!

కరోనా ప్యాండమిక్ టైం లో థియేటర్స్ కి ఎలాంటి పరిస్థితి ఎదురైందో అందరికీ తెలుసు. ఊహించని రీతిలో థియేటర్స్ వ్యవస్థ దెబ్బ తింది. అయినా కూడా ఆడియెన్స్ పెద్ద పీఠ వేసేది మాత్రం థియేటర్స్ కే అని మళ్ళీ రుజువు అయ్యింది. మొదటగా తెలుగు ఆడియెన్స్ భారీ సక్సెస్ లు ఇస్తే ఇప్పుడు తమిళ్ ఆడియెన్స్ వంతు వచ్చింది.

గతంలో మాస్టర్ సినిమా కి వసూళ్లు ఇచ్చిన తమిళ్ జనం ఇప్పుడు అక్కడ యువ హీరో శివ కార్తీ సినిమా “వరుణ్ డాక్టర్” కి అందించారు. ట్రేడ్ వర్గాలు కూడా అనుకోని రీతి వసూళ్లు ఈ సినిమా సొంతం అయ్యాయి. రిలీజ్ నాటి నుంచే భారీ వసూళ్లు అందుకోవడమే కాకుండా నిలకడ మైంటైన్ చేసి ఇప్పుడు 60 కోట్ల క్లబ్ లో చేరుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అంతే కాకుండా తెలుగులోకి కూడా ఈ సినిమాకి లాభాలు వచ్చాయి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు.. ఇక ఈ చిత్రానికి పని చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ లు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో “బీస్ట్” అనే భారీ సినిమా చేస్తున్నారు ఇక అదెలా ఉంటుందో చూడాల్సిందే.