Ghani : వరుణ్ తేజ్ కోసం ఐటెం గర్ల్ గా ఈ స్టార్ హీరోయిన్.?

Ghani : టాలీవుడ్ యంగ్ హీరోల్లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా ఒకడు. అయితే మెగా హీరోల్లో కాస్త కొద్దో గొప్పో మంచి సినిమాలు, డీసెంట్ సబ్జెక్టు లతో వెళ్లే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది వరుణ్ తేజ్ అనే చెప్పాలి. మరి అలా తాను చేస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “గని”.

దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అయ్యే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పైగా ఈ సినిమాకి గతంలో ఏ సినిమాకి కూడా కష్టపడని విధంగా తాను కష్టపడ్డాడు.

అయితే ఈ చిత్రం నుంచి తాజాగా చిత్ర బృందం ఓ హాట్ బ్యూటీ అతడి సరసన ఐటెం గర్ల్ గా కనిపిస్తుంది అని ఆమె పోస్టర్ ని రివీల్ చెయ్యకుండా తీజ్ చేస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఈ పోస్ట్ చూడడానికి పుష్ప కి టీజ్ చేసినట్టుగానే అనిపించింది కానీ సమంతా అయితే కాదులెండి. వరుణ్ సరసన మన టాలీవుడ్ మిల్కి బ్యూటీ తమన్నా ని దింపారట. మరి దీనినే ఈరోజు రివీల్ చేస్తున్నట్టు అంటున్నారు. మరి చూడాలి ఆ ఐటెం గర్ల్ ఈమేనా కాదా అనేది.