శంకర్ భారీ సినిమాలో కాజల్ ప్లేస్ లో ఈ హీరోయిన్.!

హీరోలని పాన్ ఇండియన్ లెవెల్లో నిలబెట్టగలిగే టాప్ మోస్ట్ దర్శకుల్లో ఇండియా జేమ్స్ కెమరూన్ శంకర్ కూడా ఒకరు. సందేశంతో కూడిన సినిమాలు అంతకు మించిన గ్రాండియర్ తో శంకర్ ఇప్పుడు వరకు ఎన్నో సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

కానీ దాని కన్నా ముందు నటుడు కమల్ హాసన్ తో “భారతీయుడు 2” సినిమా చేసి మధ్యలో ఆపేసారు. అనేక చిక్కులు ఇబ్బందులు తర్వాత లైన్ క్లియర్ అయ్యి చరణ్ సినిమా చేసే అవకాశం శంకర్ కి వచ్చింది. కానీ మళ్ళీ భారతీయుడు కూడా కంప్లీట్ చెయ్యాల్సి వచ్చింది. మరి ఈ గ్యాప్ లో ఎన్నో మార్పులు ఈ సినిమాకి వచ్చేశాయ్.

అలాగే మొదట ఈ సినిమాలో ఫిక్స్ చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తప్పుకున్నట్టు టాక్. తన ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ త్రిష ని ఫిక్స్ చేశారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ భారీ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి ఇక ఇదెప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.