లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొంత కాలం నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉంటూ ప్రేమపక్షులుగా విహరించారు. ఈక్రమంలోనే వీరి ప్రేమ ప్రయాణానికి నేటితో పులిస్టాప్ పెట్టి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి కూడా హాజరైనట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి క్లారిటీ లేదు.
ఇకపోతే సమంతతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి నయనతార తన పెళ్ళికి సమంతను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే సమంతకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినా సమంత మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయింది. సమంత నయనతార విజయ్ సేతుపతి ముగ్గురు తాజాగా నటించిన కాతు వాక్కుల రెండు కాదల్ సినిమా తర్వాత సమంతతో ఎంతో మంచి పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలోనే సమంత తన పెళ్ళికి ఆహ్వానించగా సమంత హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా సమంత నయనతార పెళ్లికి హాజరు కాకపోవడాకి గల కారణం కేవలం తాను నటిస్తున్న సినిమా అని చెప్పాలి. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంవల్ల నయనతార ఈ వివాహానికి హాజరు కాలేకపోయారని సమాచారం. అయితే వివాహానికి హాజరు కాలేకపోయినా సమంత 11వ తేదీ జరుగనున్న రిసెప్షన్ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలుస్తుంది.