స్టార్ హీరోలు పామును మెడలో వేసుకోకపోవడానికి కారణమేంటో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు పౌరాణిక పాత్రలలో నటించి తమ నటనతో మెప్పించారనే సంగతి తెలిసిందే. దేవుళ్లను తలచుకుంటే మొదట వాళ్ల రూపం మనకు గుర్తొస్తుంది. శివుడు అంటే మెడలో కచ్చితంగా పాము ఉండాల్సిందే. అయితే చాలామంది హీరోలు సినిమాలలో నటించే సమయంలో శివుడి పాత్రను పోషించినా పామును మెడలో వేసుకోరు. ఈ విధంగా వేసుకోకపోవడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

సీనియర్ ఎన్టీఆర్ దక్ష యజ్ఞం, ఉమా చందీ గౌరీ శంకరుల కథ సినిమాలలో నటించిన సమయంలో రియల్ పామును ధరించలేదు. శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి శివుడి పాత్రలో నటించగా చిరంజీవి లోహంతో చేసిన పామును ధరించాడే తప్ప నిజమైన పామును ధరించకపోవడం గమనార్హం. శివుడి మెడలో ఉండే పాము నిజ జీవితంలో కుదురుగా ఉండదు అనే సంగతి తెలిసిందే.

షూట్ జరిగే సమయంలో పాము వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. పాము ఉంటే కంపరంగా ఉంటుందని చాలామంది ఆర్టిస్టులు భావిస్తారు. జంతువులను సినిమాలో వినియోగించాలంటే కూడా అనుమతులు కచ్చితంగా ఉండాలి. ఈ ఇబ్బందుల వల్లే సినిమాలలో జంతువులను వాడకుండా సహజంగా జంతువులను చూపిస్తున్నారు. పాము వల్ల సినిమా వాళ్లు పడే కష్టాలను బ్రహ్మచారి సినిమాలో కమల్ బ్రహ్మాండంగా చూపించారు.

ప్రస్తుతం పౌరాణిక సినిమాలు చాలావరకు తగ్గిపోయాయి. దర్శకులు పౌరాణిక సినిమాలను తెరకెక్కించినా ఒరిజినల్ పామును కాకుండా లోహ సర్పాలను చూపిస్తున్నారు. ఈ కారణాల వల్లే సినిమా సెలబ్రిటీలు సినిమాలలో పాత్రలలో పామును ధరించడానికి అస్సలు ఇష్టపడరు. ఎంతో అవసరమైతే మాత్రమే జంతువులను హీరోలు సినిమాలలో వినియోగిస్తూ ఉండటం గమనార్హం.