Ys Jagan And Chiru Meeting : వైరల్ : చిరు – జగన్ ల మీటింగ్ వెనుక అసలు కారణం ఇంకోటి ఉందా?

Ys Jagan And Chiru Meeting :  ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ లు కీలక మీటింగ్ కోసం భేటీ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్ననే ఊహించని విధంగా బ్రేకింగ్ న్యూస్ తో స్టార్ట్ అయ్యిన ఈ మీటింగ్ ధరలు సహా ఏపీలో థియేటర్ సిస్టం కి సంబంధించి కీలక నిర్ణయాలు అంశాలపై చర్చలు జరిగాయని తెలిపారు.

సరే ఇదంతా బాగానే ఉన్నా అసలు మీటింగ్ కి అసలు కారణం ఏంటి? జగన్ చిరు ని అంత అత్యవసరంగా ఎందుకు పిలిచారు? అంతకు ముందు చిరు ఎన్నో సార్లు అర్జీ పెట్టుకున్నా కనికరించని జగన్ తానే స్వయంగా పిలవడం ఏంటి అని ఆసక్తికర ప్రశ్నలు మొదలు కాగా అందుకు గాను ఒక సమాధానం ఇప్పుడు వినిపిస్తూ వైరల్ అవుతుంది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అలాగే వారి మంత్రులు చేసిన కామెంట్స్ పట్ల హీరోలు మరియు నిర్మాతలు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చెయ్యడం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదు అని అడగడానికి చిరు ని జగన్ ఇంత అత్యవసరంగా పిలిపించినట్టు తెలుస్తుంది.

నిన్న చిరు చెప్పిన మాటల్లో ఇవే హైలైట్ గా మారాయి. ఈ ఒక్క మాట కోసమే చిరుని జగన్ పిలిపించుకున్నారని సినీ వర్గాల్లో ఈ టాక్ చిన్నగా వైరల్ అవుతుంది. ఇక జగన్ చెప్పినట్టుగానే అన్ని హామీలు నెరవేరుస్తారా లేదా అనేది చూడాలి మరి.