Pushpa Part 2 : ఇన్సైడ్ టాక్ : “పుష్ప 2” ఐటం సాంగ్ ఈ హాట్ భామ పేరు.?

Pushpa Part 2 : గత ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలబడ్డ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప” కూడా ఒకరు. దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తెరకెక్కించిన ఈ భారీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం 350 కోట్లకి పైగా వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమాలో ఉన్నటువంటి అనేక హైలైట్ అంశాల్లో స్టార్ హీరోయిన్ సమంతా తో చేయించిన హాట్ ఐటెం సాంగ్ కూడా ఒకటి.
అప్పటి వరకు చాలా మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు బాలీవుడ్ హాట్ బ్యూటీస్ పేర్లే వినిపించినా తర్వాత సమయం లేకపోవడంతో సమంతా తో సాంగ్ చేయించేసారు. అయినా కూడా అది ఓవరాల్ ఇండియా భారీ హిట్ అయ్యింది. మరి ఈసారి పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొనడంతో ఈసారి సాంగ్ ఎవరు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.
మరి దీనికి సమాధానంగా సెన్సేషనల్ హాట్ బ్యూటీ దిశా పటాని పేరు సమాధానంగా దొరికిందని సినీ వర్గాలలో లేటెస్ట్ ఇన్సైడ్ టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక ఇది పక్కన పెడితే దిశా కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి పుష్ప 2 లో ఆమెతో సాంగ్ చేయించినా మంచి మైలేజ్ వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో రష్మికా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం ఇస్తున్న సంగతి తెలిసిందే.