Shyam Singha Roy Remake : బాలీవుడ్ లోకి “శ్యామ్ సింగ రాయ్” తహతహలాడుతున్న ఈ స్టార్ హీరో.?

Shyam Singha Roy Remake : ఇప్పుడు మన తెలుగు సినిమా స్థాయి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏకంగా దేశ ప్రధానే మొన్న హైదరాబాద్ సాక్షిగా తెలుగు సినిమాని కొనియాడి మరింత గర్వించేలా చేశారు. మరి ఇప్పుడు కూడా మన తెలుగు నుంచి అనేక సినిమాలు వచ్చి పాన్ ఇండియా ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి అలా వచ్చి భాషతో సంబంధం లేకుండా అదరగొట్టిన మరో సినిమా “శ్యామ్ సింగ రాయ్”.

నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా మరో యంగ్ బ్యూటీ కృతి శెట్టి కూడా నటించగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించాడు. మరి మొదటి నుంచి ఎంతో నమ్మకంగా ఉన్న చిత్ర బృందం సినిమా విడుదల కి ముందు ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినా సాలీడ్ విజయాన్ని అందుకున్నారు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక అయితే పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా హిట్ అయ్యింది. దీనితో ఈ సినిమా రీమేక్ పై బాలీవుడ్ వర్గాలు కన్నేసాయట

మరి ఇది వరకే నాని కెరీర్ లో భారీ హిట్ అయ్యింది జెర్సీ సినిమాని రీమేక్ చేసిన స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ సినిమా చూసి విపరీతంగా నచ్చేయడంతో దీనిని కూడా రీమేక్ చెయ్యాలని తహతహలాడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు రాహుల్ తోనే వర్క్ చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంతవరకు ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.