Leader 2 : ఈ బిగ్ స్టార్ తో శేఖర్ కమ్ముల “లీడర్ 2” తీయబోతున్నాడా.?

Leader 2 : మన టాలీవుడ్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చాలా తక్కువ సినిమాలే ఉన్నాయని చెప్పాలి. అలాగే ఆ చిత్రాల్లో ఉన్నది ఉన్నట్టుగా తీసి చూపిస్తే ఏ సినిమా కూడా పెద్దగా ఆడలేదు కానీ అదే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కాస్త కమర్షియాలిటీ జోడించి తీస్తే మాత్రం హిట్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాల్లో హిట్ అవ్వని లిస్ట్ లోనే ఉండే మరో సినిమా “లీడర్”.
దర్శకుడు శేఖర్ కమ్ముల యంగ్ హీరో రానా దగ్గుపాటి తో తీసిన ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ కాకపోయినా ఆడియెన్స్ లో మాత్రం మంచి పేరుని తెచ్చుకుంది. అందుకే దీనికి రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై దర్శకుడు ఎప్పుడో క్లారిటీ కూడా ఇచ్చేసాడు.
లీడర్ కి సీక్వెల్ ఉందని కాకపోతే కొంచెం టైం పడుతుంది అని తెలిపారు. మరి ఇదిలా ఉండగా మళ్ళీ ఈ సినిమా రానా తోనే తీస్తారా లేక వేరే హీరోతోనా అనేది తెలుస్తుంది. ఈసారి సినిమా కి ఓ బిగ్ స్టార్ చేయబోతున్నారట. ఆ హీరో మరెవరో కూడా కాదు ఇలాంటి స్ట్రాంగ్ సోషల్ డ్రామా లకి కేరాఫ్ గా మారిపోయిన తమిళ హీరో సూర్య తో అట.
ఈ బజ్ ఇప్పుడు సినీ వర్గాల్లో మంచి ఆసక్తిగా మారిపోయింది. ఇక ఇదిలా ఉండగా ఇపుడు శేఖర్ కమ్ముల అయితే మరో తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. బహుశా దీని తర్వాత లీడర్ 2 ఉండొచ్చు.