కమల్ హాసన్ భారీ సినిమా బిగ్ గాసిప్ ని నిజం చేసిన దర్శకుడు.!

kamal haasan  : ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తన సినిమా కెరీర్ పరంగా చాలా కాలం నుంచి అంతా కామ్ గానే ఉన్నా ఒక్కసారిగా ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా “విక్రమ్” తో మళ్ళీ కమల్ సినిమా క్రేజ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.

“మాస్టర్” సినిమా ఫేమ్ దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్ లోనే ఒక భారీ ఏక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా తమ నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటులు విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లు కూడా నటించారు.

దీనితో అయితే మూవీ లవర్స్ కి పండగే అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ అనూహ్యంగా ఈ సినిమాపై గత కొన్ని రోజులు కితమే తమిళ విలక్షణమైన నటుడు సూర్య కూడా భాగం అని బిగ్ గాసిప్ బయటకి వచ్చింది. అయితే ట్రైలర్ వరకు దాన్ని రివీల్ చెయ్యలేదు కానీ లేటెస్ట్ గా అయితే స్వయంగా దర్శకుడే అనౌన్స్ చేసాడు.

తమ సినిమాలో సూర్య కూడా కూడా ఉన్నాడని సూర్య తో కలిసి ఉన్న ఫోటో తో ఈ బిగ్ అప్డేట్ ని రివీల్ చేసి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇంకా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా కమల్ హాసన్ నే తన రాజ్ కమల్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మాణం వహించారు.