ఏ సినిమా సక్సెస్ సాధించాలన్నా హీరో, హీరోయిన్ నటన కీలకమనే సంగతి తెలిసిందే. మంచి కథ, దర్శకుడు ఉన్నా హీరోహీరోయిన్ సరిగ్గా యాక్ట్ చేయకపోతే సినిమా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉండదు. తెరపై క్లోజ్ గా కనిపించే హీరోహీరోయిన్లు నిజ జీవితంలో కనీసం ఫ్రెండ్స్ లా ఉంటారా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తనకు జోడీగా నటించిన హీరోయిన్లను ఎంతో గౌరవిస్తారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు తరాల హీరోయిన్లతో కలిసి నటించిన అతికొద్ది మంది హీరోలలో చిరంజీవి ఒకరనే సంగతి తెలిసిందే. రాధ, రాధిక మరి కొందరు హీరోయిన్లు చిరంజీవితో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడం గమనార్హం. అయితే చిరంజీవిని ఇబ్బంది పెట్టిన ఇద్దరు హీరోయిన్లు ఎవరనే ప్రశ్నకు మాత్రం మాధవి, నగ్మా పేర్లు సమాధానంగా వినిపిస్తాయి. ప్రాణం ఖరీదు సినిమాలో చిరంజీవి మాధవి కలిసి నటించారు.
చిరంజీవి గొప్ప నటుడు అయినా మాధవి ఆయనకు తగిన గౌరవం ఇచ్చేవారు కాదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. చిరంజీవి, మాధవి కలిసి 10 కంటే ఎక్కువ సినిమాలలో నటించారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన పలు సినిమాలు హిట్ అయ్యాయి. సురేఖతో చిరంజీవి పెళ్లి జరిగిన తర్వాత చిరంజీవి మాధవి మధ్య బేధాభిప్రాయాలు తొలగిపోయాయి. ఆ సమయంలో చిరంజీవి తనకు వరుసకు బంధువు కావడంతో మాధవి వివాదానికి చెక్ పెట్టారు.
ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి, నగ్మా కలిసి నటించారు. ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్ హిట్ గా తన ప్రతిభ వల్లే ఈ సినిమా హిట్టైందని ఆమె అనుకున్నారు. ముగ్గురు మొనగాళ్లు షూట్ సమయంలో షూటింగ్ కు సరిగ్గా హాజరు కాకుండా నగ్మా ఇబ్బంది పెట్టారని సమాచారం. రిక్షావోడు సినిమా సమయంలో నగ్మా ఇదే విధంగా చేయగా ఆ తర్వాత చిరంజీవి నగ్మా కాంబినేషన్ లో సినిమాలు రాలేదు.