బిగ్ బజ్ : కమల్ సినిమా కోసం ముగ్గురు బిగ్గెస్ట్ స్టార్స్ ని దింపుతున్నారా?

Kamal Haasan Vikram Audio Launch

ఎప్పుడైనా కూడా కొందరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూస్తే వారి అభిమానులకి దక్కే ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఈ లిస్ట్ లో సినిమాలు పడితే ఆ ట్రీట్ గట్టిగా ఉంటుంది కానీ అవి దాదాపు అసాధ్యం అవుతాయి. కానీ కొన్ని ఫంక్షన్స్ లో ఇవి సాధ్యపడతాయి. అలాగే ఇప్పుడు మన సౌత్ ఇండియా సినిమా దగ్గర బిగ్ స్టార్స్ కి ఒక వేదిక స్థానం ఇవ్వబోతున్నట్టుగా బిగ్ బజ్ ఓ రేంజ్ లో వినిపిస్తుంది.

విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా అయినటువంటి “విక్రమ్” ఆడియో లాంచ్ రేపు తమిళనాడులో గ్రాండ్ గా జరగనుండగా ఈ ఈవెంట్ కి గాను దర్శకుడు లోకేష్ అక్కడి బిగ్ స్టార్స్ అయినటువంటి తలైవర్ రజినీకాంత్ అలాగే హీరో సూర్య మరియు మరో భారీ క్రేజ్ కలిగిన నటుడు విజయ్ ని స్పెషల్ గెస్టులుగా పిలిచాడట.

అది కూడా ఇది కమల్ సినిమా కావడంతో వారు కూడా వచ్చే టాక్ ఉందని గట్టి టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఇదే గాని నిజం అయితే ఈ నలుగురు దిగ్గజ నటులు పైగా వారితో విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ లాంటి నటులు అంతా ఒకే వేదికపై కనిపించడం ఇండియన్ సినిమా దగ్గర ఒక అరుదైన ఘటనగా నిలుస్తుందని చెప్పాలి.

అయితే దీనిపై ఇంకా ఫైనల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే కమల్ నిర్మాణం వహించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా జూన్ 3న రిలీజ్ కాబోతుంది.