ఒకే ఒక జీవితం సినిమాని రిజెక్ట్ చేసి ప్లాప్ అందుకున్న స్టార్ హీరో..?

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్, రీతు వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోండి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నా కూడా తర్వాత రోజు నుండి ప్రేక్షకుల నుండి వచ్చిన పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. టైం ట్రావెల్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని అమల కీలకపాత్రలో నటించింది.

ఇక ఈ సినిమాలో నాజర్ , ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇదిలా ఉండగా పడి పడి లేచే వయసు, ఆడాళ్లు మీకు జోహార్లు వంటి వరుస సినిమాలతో ఫ్లాప్ అందుకున్న శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాను ఒక స్టార్ హీరో చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ. శ్రీ కార్తీక్ మొదట ఈ సినిమాని విజయ్ దేవరకొండతో తీయాలని విజయ్ ను సంప్రదించినట్లు సమాచారం.

అయితే గతంలో తమిళ దర్శకుడు దర్శకత్వం వహించిన నోటా సినిమాలో నటించి ప్లాఫ్ అందుకున్న విజయ్ మరొకసారి తమిళ దర్శకుడుతో కలిసి పనిచేయాలని అనుకోలేదు. అందువల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బొక్క బోర్లా పడింది.” ఒకే ఒక జీవితం ” వంటి మంచి సినిమాను విజయ్ రిజెక్ట్ చేశాడని తెలియడంతో ఒక హిట్ సినిమాని కాదనుకొని లైగర్ సినిమాలో నటించి ప్లాఫ్ అందుకున్నాడు అంటూ నేటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ విజయ్ ఈ సినిమాలో నటించి ఉంటే విజయ్ అకౌంట్ లో మరోక హిట్ వచ్చి చేరేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.