ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. ఇటివలే విడుదలైన ‘చెప్పాలని ఉంది’ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నీ కోసం పాట విడుదలైయింది. అస్లాం కీ ఈ పాటని హార్ట్ టచింగ్ మెలోడి గా స్వరపరిచారు. కాశ్మీర్ మంచు కొండల్లో విజువల్ వండర్ గా చిత్రీకరించిన ఈ పాట విన్న వెంటనే మనసుని హత్తుకుంది. పాటలోయష్ పూరి, స్టెఫీ పటేల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ప్రేమికుల ఎడబాటుని కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం హృద్యంగా ఆవిష్కరించింది. గాయకుడు హరిచరణ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.
ఈ చిత్రంలో సునీల్, సత్య, పృధ్వి ,మురళీ శర్మ , తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆర్ పి డిఎఫ్టీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అస్లాం కీ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ చిట్నీడి డైలాగ్స్ అందిస్తున్నారు.
డిసెంబర్ 9న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలౌతుంది.
తారాగణం: యష్ పూరి, స్టెఫీ పటేల్, సత్య , పృధ్వి , మురళీ శర్మ , సునీల్ , తనికెళ్ల భరణి , రాజీవ్ కనకల, రఘుబాబు , అలీ , సత్యం రాజేష్, నంద కిషోర్ , అనంత్ తదితరులు.
సాంకేతిక విభాగం :
బ్యానర్ : సూపర్ గుడ్ ఫిల్మ్స్
సమర్పణ : ఆర్.బి చౌదరి
నిర్మాత: వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్
రచన, దర్శకత్వం: అరుణ్ భారతి ఎల్
డైలాగ్స్ : విజయ్ చిట్నీడి
డివోపీ: ఆర్ పి డిఎఫ్టీ
ఎడిటర్ : నందమూరి హరిబాబు, నందమూరి తారక రామారావు
సంగీతం : అస్లాం కీ
ఆర్ట్ డైరెక్టర్ : కోటి, వి రామకృష్ణ
కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్, అజయ్ శివశంకర్, రామ్ శివ
పీఆర్వో : వంశీ శేఖర్