Ram Charan : రిలీజ్‌కి ముందు చరణ్ సైలెంట్‌గా ఎందుకున్నాడంటే.!

Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్‌ సందర్భంగా చరణ్, ఎన్టీయార్, రాజమౌళి ఈ ముగ్గురూ చాలా కష్టపడ్డారు. ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా దేశమంతా చుట్టేసి వచ్చారు. మొత్తానికి కష్టం ఫలించింది. సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సొంతం చేసుకుంది.

అంతా బాగానే వుంది. సినిమా రిలీజ్‌కి ముందు మాత్రం చరణ్ చాలా కామ్‌గా కనిపించాడు. ప్రమోషన్స్‌లో ఎన్టీయార్ ఓవర్ ది బోర్డర్ మాట్లాడేసేవాడు. రాజమౌళి తనదైన ఇంటెన్సిటీని ప్రదర్శిస్తూ మాట్లాడేవాడు. కానీ, చరణ్ మాత్రం చాలా చాలా తక్కువ మాట్లాడాడు.

మీరెందుకు మాట్లాడడం లేదు.. అని అడిగితే, వాళ్లు మాట్లాడుతున్నారు కదా.. అని సింపుల్‌గా సున్నితంగా సమాధానమిచ్చేవాడు. అదంతా ఆఫ్ స్ర్కీన్ సంగతి. కానీ, సినిమా రిలీజయ్యాకా ఆన్ స్ర్కీన్ ఆటంబాంబులా అనిపించాడు చరణ్.

అందరికీ అదే సర్‌ప్రైజ్. ఇంత కామ్‌గా వుండే చరణ్ స్క్రీన్‌పై ఇంతలా రెచ్చిపోయి నటించేశాడేంటీ.? మైండ్ బ్లోయింగ్.. మాటల్లేవ్.. మాటాడుకోవడాల్లేవ్.. అనే రెస్పాన్స్ వస్తోంది చరణ్ విషయంలో. ‘మగధీర’, ‘రంగస్థలం’.. సినిమాల్లో చరణ్ అద్భుతమైన నటన ఆల్రెడీ చూసేశాం.

కానీ, వాటిని మించి వంద రెట్లు అనేంతలా వుంది ‘ఆర్ఆర్ఆర్’ లో చరణ్ నటన. ఇదే ఇప్పుడు అందరి నోటా వస్తున్న మాట. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు.