‘సీతారామం’ నుండి మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ ‘కానున్న కళ్యాణం’ విడుదల

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ చిత్రం ఆసక్తికరమైన ప్రొమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు పెంచుతోంది. ముఖ్యంగా పాటలకు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ ‘కానున్న కళ్యాణం’ పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సిందూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా వుంది

♪♪కానున్న కళ్యాణం ఏమన్నది ?
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది ?
ప్రతి క్షణం మరో వరం
విడువని ముడి ఇది కదా
ముగింపు లేని గాధగా
తరముల పాటుగా తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.. ♪♪

పాట పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం మనసుకి గొప్ప హాయిని నింపేలా అనిపించాయి. అద్భుతమైన లోకేషన్స్ చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది. ముఖ్యంగా దుల్కర్, మృణాల్ మ్యజికల్ గా కనిపిస్తుంది.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది.

స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: అశ్వినీదత్
బ్యానర్: స్వప్న సినిమా
సమర్పణ: వైజయంతీ మూవీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్
ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో : వంశీ-శేఖర్