వెంకటేష్ సౌందర్య మధ్య ఉన్న రిలేషన్ గురించి బయట పెట్టిన మేకప్ మ్యాన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబం నుండి హీరోగా అడుగుపెట్టిన వెంకటేష్, ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నడు. వెంకటేష్ హీరోగా నటించిన సినిమాలు అన్ని దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల ఎఫ్2, ఎఫ్ 3 సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్ తాజాగా ఓరి దేవుడా సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా మాత్రమే కాకుండా సినిమాలలో ప్రధాన పాత్రలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల వెంకటేష్ గురించి ఆయన పర్సనల్ మేకప్ మెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల వెంకటేష్ పర్సనల్ మేకప్ మెన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెంకటేష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో వెంకటేష్ సౌందర్య మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెంకటేష్, సౌందర్య జోడి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హిట్ జోడి గా గుర్తింపు పొందింది. వీరిద్దరూ దాదాపు 8 సినిమాలలో కలిసి నటించారు. మీరు నటించిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇలా వీరిద్దరూ కలిసి ఇన్ని సినిమాలలో నటించినప్పటికీ వీరిద్దరి గురించి ఇప్పటివరకు ఎలాంటి రూమర్లు వినిపించలేదని ఆయన చెప్పుకొచ్చాడు.

సౌందర్య గారికి వెంకటేష్ అంటే చాలా అభిమానం అని వీరిద్దరూ కలిసి అన్ని సినిమాలలో నటించిన కూడా సౌందర్య వెంకటేష్ గారిని సార్ అని పిలిచేది అని చెప్పుకొచ్చాడు. సౌందర్య చాలా మంచి అమ్మాయి. సెట్ లో ఆమె అందరితో చాలా కలివిడిగా ఉండేది. ఇక వెంకటేష్ గారు కూడా సెట్ లో అందరితో చాలా సరదాగా ఉండేవాడు. కాకపోతే ఆయన ఎక్కువగా ఎవరితోనో మాట్లాడే వారు కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకసారి మేమందరం కలిసి షూటింగ్ కోసం బెంగళూరుకి వెళ్ళినప్పుడు సౌందర్యం అందర్నీ తన ఇంటికి ఆహ్వానించి స్పెషల్ గా వంటలు తయారు చేయించి తానే మా అందరికీ వడ్డించింది అంటూ వెల్లడించాడు.