కోవిడ్ కారణంగా గత 2 సంవత్సరాల నుండి విద్యా సంస్థల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మధ్య మధ్యలో ఆన్లైన్ క్లాసులు అంటూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు విద్యార్థులు. ఇక గత కొన్ని రోజుల నుండి కోవిడ్ ప్రభావం తక్కువగా ఉండటంతో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి.
ఇక ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభం అవడంతో ఒంటిపూట బడులు కూడా నిర్వహించనున్నారు విద్యాశాఖ. తాజాగా ఈ విషయం గురించి ఒక నిర్ణయం తెలిపింది. రేపటి నుంచి అనగా మార్చి15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించుకుంది. ఉదయం 8 నుంచి 12.30 వరకు పాఠశాలలు కొనసాగుతాయని.. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రత్యేక క్లాసులు ఉంటాయని నిర్ణయించారు.