బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఆరవ సీజన్ ప్రసారమవుతుంది. ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు అప్పటివరకు టాప్ పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఒక్కసారిగా డేంజర్ లోకి వెళ్తుంటారు. ఊహించిన విధంగా మరికొంతమంది కంటెస్టెంట్లు టాప్ పొజిషన్లోకి వెళుతుంటారు. అయితే ఇప్పటివరకు బాలాదిత్య టాప్ పొజిషన్లో ఉండగా సడన్ గా ఈయనని వెనక్కి నెట్టి మరొక కంటెస్టెంట్ లోకి వెళ్లారు.
ఇక గత వారం వరకు నామినేషన్ లో ఉన్నవారు ఓట్లను సంపాదించుకున్న విషయంలో రేవంత్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఈవారం కెప్టెన్ గా ఉండటం వల్ల ఇతను నామినేషన్స్ లో లేరు ఇక రేవంత్ లేకపోవడంతో శ్రీహాన్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇక రెండవ స్థానంలో ఓటింగ్ విషయంలో ఎవరు ఊహించని విధంగా ఆదిరెడ్డి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఈ విధంగా రెండో స్థానంలో ఉన్నటువంటి ఆదిరెడ్డి శ్రీహన్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఈయన తర్వాత ఇక మూడవ స్థానంలో కీర్తి చోటు సంపాదించుకున్నారు. గీతు రాయల్ టాస్కుల విషయంలో కాస్త డల్ అయినట్టు తెలుస్తోంది.
ఇలా గీతో నాలుగవ స్థానంలో నిలబడగా ఆమె తర్వాత రాజశేఖర్ ఐదవ స్థానంలో ఉన్నారు. రాజశేఖర్ తర్వాత ఆరవ స్థానంలో శ్రీ సత్య ఉండగా ఏడవ స్థానంలో మెరీనా ఉన్నారు. ఇక తొమ్మిది మంది కంటెస్టెంట్లలో డేంజర్ జోన్ లో ఉన్నటువంటి వారిలో బాలాదిత్య సుదీప ఉన్నారు. బాలాదిత్య ఎనిమిదవ స్థానంలో ఉండగా సుదీప తొమ్మిదవ స్థానంలో ఉంది.ఇలా నామినేషన్ అయిన తర్వాత ఓటింగ్ విషయంలో బాలదిత్య డేంజర్ జోన్ లోకి వెళ్లారు. ఇలాగే ఈ నాలుగు రోజులు పాటు కొనసాగితే ఈయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అభిమానులు అందులో వ్యక్తం చేస్తున్నారు.