Cat: వామ్మో.. వంద కోట్లు నష్టం తెచ్చిపెట్టిన పిల్లి!

Cat: ఒక పిల్లి వల్ల రూ.100 కోట్లు నష్టం రావడం ఏంటి అని అనుకుంటున్నారా.. కానీ ఇది నిజంగా జరిగిన సంఘటనే. మామూలుగా పిల్లి తను ఎలా కడుపు నింపుకోవాలి.. ఎలా రక్షణ గా ఉండాలా అని గోడలు వంటివి ఎక్కడం చేస్తుంటాయి. అంతేకానీ దానికి మరో ధ్యాస ఉండదు. అలా ఓ దగ్గర విశ్రాంతి తీసుకోవాలనుకుందేమో.. ఏమో.. ఏకంగా వంద కోట్ల నష్టంతెచ్చిపెట్టింది.

మహారాష్ట్రలో పూణే పట్టణ దగ్గర్లో పింప్రీ – చించ్వడ్ ప్రాంతంలో ఓ పిల్లి సబ్ స్టేషన్ లో ఓ ట్రాన్స్ఫార్మర్ మీదకు ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అక్కడున్న 60 వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోవడంతో.. ఆ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలా ఏడు వేల మంది వ్యాపారులు విద్యుత్ అంతరాయం తో ఇబ్బంది పడటం వల్ల వీరికి ఏకంగా వంద కోట్లకు పైగా నష్టం ఎదురైంది.