పెద్దింటికి పెద్ద కోడలు కాబోతున్న హన్సిక… ?

హన్సిక తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే మొదటి సినిమా మంచి విజయం అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అనంతరం ఈమె నటించిన సినిమాలతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోవడంతో ఈమె తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరు సంపాదించుకున్న హన్సిక విపరీతమైన తమిళ ప్రేక్షకులను సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈమె తమిళ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే పలువురు హీరోలతో ప్రేమ ప్రయాణం అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈ విధంగా హన్సిక ప్రేమ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇకపోతే తనకు ఇండస్ట్రీలో క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి ఆ అవకాశాలను అందుకొని మరోసారి బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా హన్సికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. హన్సిక తొందరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో కోడై
కూస్తుంది.

గతంలో పలువురు హీరోలతో ప్రేమ అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.ఇలా హన్సిక వివాహానికి తన పెద్దలు నిశ్చయించిన వివాహంగా చేసుకోబోతున్నారని ఇప్పటికీ ఈ కుటుంబాలకు సంబంధించిన మాటలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.త్వరలోనే హన్సిక వివాహం గురించి అధికారిక ప్రకటన తెలియజేయడమే కాకుండా ఈమె నిశ్చితార్ధాన్ని కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.మరి హన్సిక పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.