సమంత మీద ‘బ్లాక్ మార్క్’: కెరీర్ ఎలా ముందుకు సాగేనో.!

సినీ సెలబ్రిటీల విడాకులంటే.. మీడియాకి పెద్ద పండగే. పెళ్ళికి మించిన పండగ ఇది మీడియాకి సంబంధించినంతవరకు. సమంత – నాగచైతన్యల పెళ్ళి చుట్టూ ఎంత ప్రచారం జరిగిందోగానీ, అంతకు మించిన ప్రచారం విడాకుల చుట్టూ జరిగింది. చివరికి విడాకులపై ఇరువురూ అధికారిక ప్రకటన చేసేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది.

సమంత పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ కనిపిస్తోంది. న్యూస్ ఛానళ్ళు విపరీతంగా పోస్ట్ మార్టం చేసేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంత మళ్ళీ నటిగా పుంజుకోవడం సాధ్యమయ్యే పనేనా.? అన్న చర్చ జరుగుతోంది. పెళ్ళయ్యాక కూడా సమంతకి సినిమాల పరంగా క్రేజ్ తగ్గలేదు.

పెళ్ళయ్యాక కొన్ని సినిమాల్లో నటించేందుకు సమంత ‘ఓకే’ చెప్పలేకపోయింది. కానీ, ఇకపై సమంతకి ఆ సమస్య వుండకపోవచ్చు. తమిళంలో ఓ మూడు సినిమాలకి సమంత ఆల్రెడీ సైన్ చేసేసిందనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నుంచి కూడా సమంతకి అవకాశాలు వస్తున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం సమంత, అవకాశాలు దక్కించుకోవాలంటే.. కొంత సమయం పడుతుందట. అక్కినేని కాంపౌండ్ నుంచి ఆమెకు సహాయ నిరాకరణ ఎదురవుతుందని అనుకోలేం. నాగార్జున అలాంటి వ్యక్తి కూడా కాదు. పైగా, సమంత – చైతూ విడిపోవడం పట్ల నాగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేశారు సోషల్ మీడియా వేదికగా.

కారణాలైవేనా, కొన్నాళ్ళపాటు సమంత, తెలుగు సినిమాల్లో కనిపించకపోవచ్చునన్నది నిర్వివాదాంశం.