Chiranjeevi and Rajasekhar : కొన్ని సినిమాలు కొందరు హీరోలకే సెట్టవుతాయ్. అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండానే ఒక హీరో కోసం ఎంచుకున్న కథల్లోకి ఇంకో హీరో వచ్చి చేరుతుంటారు. అలా రూపొందిన సినిమాలు అనూహ్యంగా ఘన విజయాలు సాధిస్తుంటాయ్. ఇవన్నీ అనుకోకుండా జరిగే అంశాలే.
అయితే, సినిమా ఘన విజయం సాధించాకా, ఈ సినిమా నేను చేయాల్సిన సినిమా.. అని మిస్ అయిన హీరో అనుకోవడం, హిట్ కొట్టిన హీరోపై జెలసీ ఫీలవడం ఎంతవరకూ సబబు.? మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ మధ్య వున్నది ఇలాంటి జెలసీనే. ఆ జెలసీ కాస్తా, రాజకీయ విబేధాలతో గొడవలుగా మారాయ్.
చిరంజీవి చేసిన సినిమాలు కొన్ని తొలుత రాజశేఖర్ చేద్దామనుకుని విఫలమయ్యారు. అందులో ‘ఠాగూర్’ కూడా ఒకటి. ఈ సినిమా ఏ రేంజ్ సూపర్ హిట్ సినిమానో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా విషయంలో చిరంజీవిదే తప్పు.. అంటూ కొందరు దుష్ర్పచారం చేశారు అప్పట్లో.
రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత.. కావాలని చేయించిన దుష్ర్పచారమే ఇది అని కూడా అంటుంటారు. ఇదే విషయమై ఆ తర్వాత చిరంజీవితో రాజశేఖర్ రాజీకి కూడా వెళ్లారని అంటుంటారు.
అయితే, ఏది నిజమో ఆ పైవాడికే ఎరుక అనుకోండి. ఇకపోతే, ఆధిపత్య పోరు విషయానికి వస్తే, అనవరసరమైన చర్చ ఇది. ఎందుకంటే, చిరంజీవి రేంజ్ వేరు. రాజశేఖర్ రేంజ్ వేరు. అలాంటి వీరిద్దరి మధ్యా ఈ ఆధిపత్య పోరు అసలెందుకో అర్ధం కాదెవరికీ.!