చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఒకప్పుడు వీళ్ళు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోలు. 1980, 1990 దశకాల్లో వీళ్ళు నలుగురు టాలీవుడ్ ని ఏలారు. ఎంత మంది పోటీ వచ్చినా, వీళ్ళ స్టార్ డోమ్ కి తిరుగు ఉండేది కాదు. కానీ, 2000 సంవతసరం మొదట్లో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలను ఒక ఉపకమింగ్ హీరో భయపెట్టాడు.
ఆ హీరో ఎవరో కాదు ఉదయ్ కిరణ్. ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్, ఆ తర్వాత వచ్చిన ‘నువ్వు నేను’ సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరో అయిపోయాడు. యూత్ లో ఉదయ్ కిరణ్ కు ఎక్కువగా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో స్టార్ డైరెక్టర్ లు నిర్మాతలు కూడా ఉదయ్ కిరణ్ డేట్స్ కోసం వేచి చూసేవాళ్ళు.
ఒకానొక సందర్భం లో ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ సినిమా రిలీజ్ అవ్వబొయె టైంలోనే వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’, చిరంజీవి ‘డాడీ’ సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయితే ఉదయ్ కిరణ్ కి భయపడి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ నిర్మాత ఎం ఎస్ రాజును ‘మనసంతా నువ్వే’ సినిమాను వాయిదా వెయ్యమని కోరారు.