Sampath Raj: భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం అదే..! నటుడు సంపత్ రాజ్..!

Sampath Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా కొనసాగుతూ ఎన్నో సినిమాలలో తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన నటుడు సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరియర్ మొదట్లో దమ్ము, పంజా వంటి చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమా ద్వారా ఊహించని విధంగా తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఆయన తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సంపత్ తన వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. తన భార్యతో తను విడాకులు తీసుకున్న విషయం గురించి కూడా ఈ కార్యక్రమం ద్వారా బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు చిన్న వయసు అమ్మాయిని పెళ్లి చేయడం వల్ల మా ఇద్దరి మధ్య ఎన్నో విభేదాలు వచ్చేవని, సఖ్యత లేని కారణంగానే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా సంపత్ రాజ్ తెలిపారు.

అందుకే అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లి చేయకూడదని వారికంటూ ఒక అవగాహన ఏర్పడిన తర్వాత పెళ్లి చేస్తేనే వారు సంతోషంగా ఉంటారని ఆయన తెలిపారు. ఇదే విషయం గురించి తన కూతురికి కూడా బాగా అర్థమయ్యేటట్టు వివరించానని విడాకుల తర్వాత పూర్తిగా తన కూతురి బాధ్యతను తానే తీసుకున్నానని తెలిపారు.ఇలా మేమిద్దరం విడాకులతో విడిపోవటం వల్ల తన కూతురు చాలా బాధపడిందని నటుడు సంపత్ రాజ్ ఈ సందర్భంగా వారి వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.