యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా విజయవాడలోని కె.ఎల్.యూనివర్సిటీలో మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..
నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘పదేళ్ల క్రితం మీ కాలేజ్‌కు వచ్చి షూటింగ్ చేశాను. ఇక్కడకు మళ్లీ రావడం నాకు ఆనందంగా ఉంది. కాలేజ్ ఈవెంట్స్‌కు వచ్చినప్పుడు నేను ఎక్కువ జెలసీగా ఫీలవుతుంటాను. ఎందుకంటే ఈ కాలేజ్ లైఫే అసలు లైఫ్. స్కూల్, కాలేజ్ లైఫ్ మనకు ఎంతో నేర్పిస్తుంది. కానీ మనం దాన్ని అప్పుడు రియలైజ్ అవ్వం.
కానీ ఓ పదేళ్ల తరువాత అర్థమవుతుంది. ఈ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి. ఓ సినిమా హిట్ అయితే.. విజయవాడ నుంచే ఆ సౌండ్ హైద్రాబాద్ వరకు వస్తుంది. మీరిచ్చే ఎనర్జీ, సపోర్ట్‌తో మేం ఏదైనా చేయగలం. పీసీ శ్రీరామ్ గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కలిసి పని చేశాను. రాశీ ఖన్నాతో పని చేయడం ఆనందంగా ఉంది. థాంక్యూ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి’ అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ.. ‘నాగ చైతన్య జోష్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను.మేం ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ ఆయన కెరీర్‌లో చేసిన సినిమాలన్నింటిలో మజిలీ నాకు చాలా ఇష్టం. మజిలీ తరువాత.. థాంక్యూనే ఫేవరేట్ సినిమా. ఇదంతా కూడా గ్రాటిట్యూడ్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే నా గురువు మణిశర్మ గారి బర్త్ డే వచ్చింది. ఆ పార్టీకి వెళ్లి మణి గారిని హగ్ చేసుకున్నాను. నా కంట్లోంచి నీళ్లు తిరిగాయి. మణి గారి కోసం అక్కడే డ్రమ్స్ వాయించాను. అదంతా కూడా నా గ్రాటిట్యూడ్. ఈ సినిమాలోనూ అదే ఉండబోతోంది. మన వాళ్ళ కోసం థాంక్యూ చెప్పడం. ఈ సినిమా కోసం పని చేయడం ఆనందంగా ఉంది. థాంక్యూ లాంటి సినిమాలు ఓ రకమైన సంతోషాన్ని ఇస్తాయి. దిల్ రాజు గారికి ఒళ్లంతా కూడా దిల్లే. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. రీ రికార్డింగ్ చేయకుండానే ఈ చిత్రం చూసినప్పుడు నా కంట్లో నీళ్లు వచ్చాయి. ఈ చిత్రంలోనే ఓ లైఫ్ ఉంది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు థాంక్యూ. విక్రమ్ కె కుమార్ చుట్టూ ఎప్పుడూ ప్రేమ తిరుగుతూనే ఉంటుంది’ అని అన్నారు.
విక్రమ్ కే కుమార్ మాట్లాడుతూ.. ‘మేం ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమతో తెరకెక్కించాం. మీరు ఆ ప్రేమను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
రైటర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ..’నాగార్జున గారు, నాగ చైతన్య గారికి నేను అభిమానిని. ఈ సినిమా అనేది వారికి గ్రాటిట్యూడ్‌లాంటిది. విక్రమ్ కుమార్ సినిమాలు అన్నీ చూసి ఉంటారు.. కానీ అందులోంచి థాంక్యూ అనేది ది బెస్ట్ అవుతుంది. తమన్య సౌండింగ్, పీసీ శ్రీరామ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. గీతాంజలి సినిమాను చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ఈ చిత్రాన్ని చూసినప్పుడు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఓ పండుగలా అనిపిస్తుంది’ అని అన్నారు.