Thaman: సినీ ఇండస్ట్రీలో ఉన్న తన శిష్యులు ఇప్పటికీ తనపై కృతజ్ఞతా భావంతోనే ఉంటారని మ్యూజిక్ డైరెక్టర్ కోటి అన్నారు. వారిలో ముఖ్యంగా ఏ ఆర్ రెహమాన్ ఎప్పుడూ చెప్తూ ఉంటారని, నా దగ్గర పని చేశానని, ఎన్నో నేర్చుకున్నానని, అంతే కాకుండా హరీష్ జయరాజ్, తమన్ ఇలా చాలా మంది ఉన్నారని కోటి చెప్పుకొచ్చారు.
ఇకపోతే తమన్ అయితే ఎప్పుడూ తన పేరే జపిస్తూ ఉంటాడని ఆయన అన్నారు. ఎందుకంటే కమర్షియల్ మీడియా మ్యూజిక్ ని ఎలా చేయాలనే ట్రెండ్ తీసుకువచ్చిందే తాము అని, ఇంకా ఎవరూ కూడా లేరు అని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. ఎలక్ట్రానిక్స్ తో, కంప్యూటర్ తో ఆడుకున్న ఆటలు తాము ఆడినట్టు ఇంకొకరు ఆడలేదని ఆయన అన్నారు. అవన్నీ వీళ్ళకి అడ్వాంటేజ్ గా మారాయని చెప్పారు.
ఇదంతా ఏదో నా గొప్ప కోసం చెప్పుకుంటున్నది కాదు అని, ఇదంతా తానకు అనుభవపూర్వకంగా జరిగిందని కోటి తెలిపారు. తాను కీబోర్డు ప్లేయర్ ని మాత్రమే నమ్ముకొని మ్యూజిక్ చేయలేదని, ఇంకొకరు చేసింది తాను తీసుకోలేదని ఆయన చెప్పారు. ఎప్పుడైనా కూడా తన నోట్ ఉంటేనే ఆ పాట ముందుకెళ్లేదని కోటి తెలిపారు. ఇందులో తాను గొప్పగా చెప్తుందేమీ లేదని అదే తన పని అని అని ఆయన వివరించారు.