దళపతి విజయ్- వారసుడు ఫస్ట్ సింగిల్ రంజితమే విడుదల.

దళపతి విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి క్రేజీ కాంబినేషన్‌ లో భారీ అంచనాలు ఉన్న వారసుడు/వారిసు చిత్రం ప్రకటించిన రోజు నుండి మాసీవ్ ప్రమోషన్‌ లతో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండి ఫస్ట్ లుక్ తో పాటు ఇతర పోస్టర్‌ లు.. ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ రంజితమే తమిళ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. 75 మిలియన్ + వ్యూస్ ని క్రాస్ చేసి సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగు అభిమానులను ఆనందపరిచే విధంగా.. మేకర్స్ రంజితమే పాట తెలుగు వెర్షన్‌ ను ఈ రోజు విడుదల చేశారు.

బ్లాక్ బస్టర్ కంపోజర్ ఎస్ థమన్ ఈ పాటని మాస్ ఫుట్‌ ట్యాపింగ్ నంబర్‌ గా స్కోర్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, అనురాగ్ కులకర్ణి, మానసి వోకల్స్ మాస్ ని మెస్మరైజ్ చేశాయి. పాటలో విజయ్, రష్మిక ల కెమిస్ట్రీ, కాస్ట్యుమ్స్, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి.

రామజోగయ్య శాస్త్రి అందించిన క్యాచి లిరిక్స్ తెలుగు వెర్షన్‌ కి ఫ్రెష్ నెస్ తెచ్చిపెట్టింది. తమిళ్ పాటలానే తెలుగు వెర్షన్ కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వడం ఖాయం.

ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ అందించారు. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత ఈ చిత్రానికి సహ నిర్మాతలు. సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

వారసుడు/వారిసు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి విడుదల కానుంది.

తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్
డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్
ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్
మేకప్: నాగరాజు
కాస్ట్యూమ్స్: దీపాలి నూర్
పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న
వీఎఫ్ఎక్స్: యుగంధర్
పీఆర్వో: వంశీ-శేఖర్