తీస్ మార్ ఖాన్ మూవీ రివ్యూ

నటీనటులు : ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ.
నిర్మాత : నాగం తిరుపతి రెడ్డి
దర్శకత్వం : కళ్యాణ్ జీ గోగాన
సంగీతం : సాయి కార్తీక్

నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ కొడుకు ఆది ‘ప్రేమకావాలి’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలిరోజుల్లో కొన్ని డీసెంట్ హిట్స్ అందుకున్నాడు. కానీ తర్వాత పూర్తిగా గాడి తప్పాడు. ఆది నటించిన ఏ సినిమా కూడా కనీసం ఓ మాదిరి గా కూడా ఆడలేదు. కొన్ని నెలల  క్రితం వచ్చిన ‘బ్లాక్’, ‘అతిథిదేవోభవ’ సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాక ‘తీస్ మార్ ఖాన్’ సినిమాతో ముందుకొచ్చాడు. ఈ సినిమాతో అయినా ఆది హిట్ సాదిస్తాడేమో చూద్దాం.

కథ:

తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్) ఒక కాలేజ్ స్టూడెంట్. జీవితం లో ఎప్పటికైనా  పోలీస్ అవ్వాలి అనుకుంటాడు. కొన్నాళ్ళకు తన కల నెరవేరుతుంది అనుకునే సమయంలో తీస్ మార్ ఖాన్  కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఒక మాఫియా లీడర్ తీస్ మార్ ఖాన్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ క్రమం లో తీస్ మార్ ఖాన్ తన సోదరిని, తన సోదరి భర్తని కోల్పోతాడు. తర్వాత ఏం జరిగింది? అసలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? తీస్ మార్ ఖాన్ తనని ఇంత ఇబ్బంది పెట్టిన వారిపై పగ తీర్చుకుంటాడా? చివరికి పోలీస్ అవుతాడా? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:

 
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
బోరింగ్ సీన్స్
అవసరం లేకుండా వచ్చే పాటలు
బలహీనమైన కథనం

తీర్పు :

టెక్నికల్ గా ఈ సినిమా బాగున్నా…కథ  విషయంలో కొత్తదనం లోపించింది. ఇలాంటి కథ మనం అంతకుముందు చాలా సినిమాల్లో చూశాం. స్టోరీ, లాజిక్ లాంటివి పక్కన పెట్టి కమర్షియల్ సినిమాలను ఎంజాయ్ చేసే వాళ్లకి తీస్ మార్ ఖాన్ ఒక్కసారి చూడగలిగే సినిమా అవుతుంది.