Nani’s Ante Sundaraniki : టీజర్ టాక్ : “అంటే సుందరం”తో నాని మళ్ళీ హిట్ కొట్టేస్తున్నాడా? చూద్దాం రండి!

Nani’s Ante Sundaraniki : టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లాస్ట్ సినిమా అయినటువంటి “శ్యామ్ సింగ రాయ్” తో తన కెరీర్ లో అదిరే హిట్ ని అందుకున్నాడు. అలాగే ఈ హిట్ అనంతరం మరో ఇంట్రెస్టింగ్ సినిమాగా పూర్తిగా కొత్త లుక్ లో చేసిన సినిమా “అంటే సుందరానికి”.
దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఇప్పుడు టీజర్ కట్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ చూసాక నాని మళ్ళీ ఒక క్లీన్ హిట్ హిట్ కొట్టేలా ఉన్నాడని చెప్పాలి. తనలోని కామెడీ టైమింగ్ కి కాస్త కథలో కొత్తదనం కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే చూసాము.
అలానే ఈ సినిమా కూడా ఉండేలా అనిపిస్తుంది.ఓ బ్రాహ్మణ కుర్రాడిగా నాని గెటప్ లో మంచి ఫన్ ని తీసుకొచ్చాడు. అలాగే ఈ బ్రాహ్మణ అబ్బాయి క్రైస్తవ అమ్మాయితో ప్రేమలో పడితే వారి పెళ్ళికి పెద్దలు ఒప్పుకుంటారా లేదా ఈ కోణంలో నాని పాత్రకి ఓ పెద్ద సమస్య ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఈ సినిమా కథలా కనిపిస్తుంది.
అలాగే ఇలాంటివి కాస్త సున్నితమైన సబ్జక్ట్స్ అయినా దానిని ఫన్ గా దర్శకుడు చూపించడం బాగుంది. టోటల్ గా అయితే ఈ టీజర్ బాగానే నానికి మరో హిట్ ఇచ్చేలా కనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే జూన్ 10 వరకు ఆగాలి.
అలాగే ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. హిట్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.
https://www.youtube.com/watch?v=OSV33DywiRs&feature=youtu.be