టీజర్ టాక్ : MEGA154 టైటిల్ రివీల్..ఇది మెగాస్టార్ రేంజ్ సినిమా అంటే.!

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న పలు సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అలాగే మాస్ మహారాజ రవితేజ లు హీరోలుగా నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారింగ్ చిత్రం కూడా ఒకటి. మరి మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా దీనిని తెరకెక్కిస్తుండగా అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాని పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ దర్శకుడు బాబీ తెరకెక్కించగా ఈరోజు అయితే ఈ సినిమాపై దీపావళి కానుకగా ఓ బిగ్ బ్లాస్ట్ ని అయితే మేకర్స్ అనౌన్స్ చేసారు. మరి ఈ టీజర్ జస్ట్ నార్మల్ గ్రాఫిక్స్ విజువల్స్ తోనే స్టార్ట్ అయినా అక్కడ నుంచి ఒక్కసారిగా వచ్చిన బ్లాస్ట్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంది.

మెగాస్టార్ వింటేజ్ రోజులు గుర్తు చేస్తు ముఠామేస్త్రి రేంజ్ లో లుక్స్ లో ఆ గ్రేస్ తో బాస్ అయితే దుమ్ము లేపేశారు. ఇక అక్కడ నుంచి మరో మాస్ డైలాగ్ ఆ నడక అంతా మళ్ళీ ఫ్యాన్స్ ని ఇంకో ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లినట్టు అయిపోయింది. అక్కడ నుంచి సినిమా టైటిల్ “వాల్తేర్ వీరయ్య” అంటూ రివీల్ అయ్యింది.

ఇక ఈ టీజర్ లో సూపర్ మ్యూజిక్ ఇచ్చిన డిఎస్పీ కూడా దుమ్ము లేపేసాడు. లాస్ట్ లో ఇక మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఓవర్ దెబ్బకి టీజర్ ఇంకో లెవెల్ కి వెళ్ళింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది అసలైన మెగాస్టార్ రేంజ్ సినిమా అని చెప్పి తీరాల్సిందే.