Balakrishna: పేదల సంక్షేమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది: నందమూరి బాలకృష్ణ

Balakrishna: ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబు కూడా ఈ సందర్భంగా తన ట్విట్టర్ వేదికగా కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఇక తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని విషయాలు తెలిపాడు.

పోరాటమే మన ఊపిరి అని.. ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి ఇదే అని అన్నాడు. 40 సంవత్సరాల నుండి పసుపు జెండా రెపరెపలాడుతుందని.. దీనికి కారణం కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు అని అన్నాడు. ఎన్టీఆర్ ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించాలని.. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీనే అని తెలిపాడు. అంతేకాకుండా కొన్ని పథకాలతో మన రాష్ట్రం అన్నపూర్ణగా మారడానికి తెలుగుదేశం కారణమని అన్నాడు.