ఆ న్యూస్ పై షాక్ ఇచ్చిన తరుణ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి, మంచి అవార్డులు అందుకున్న తరుణ్, ఆ తర్వాత హీరో గా మారి ‘నువ్వే కావాలి’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ లాంటి సూపర్ హిట్స్ లో నటించి స్టార్ హీరో గా ఎదిగాడు. ఒకప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోస్ కూడా లేని ఓపెనింగ్స్ తరుణ్ సినిమా కి వచ్చేవి. అయితే వరుస ప్లాప్స్ తో తరుణ్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత తరుణ్ సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు.

అయితే ఈ మధ్య తరుణ్ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నది వార్తలు వచ్చాయి. దీని పై తరుణ్  క్లారిటీ ఇచ్చాడు. సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తన జీవితంలో ఏం జరిగినా తానే స్వయంగా అభిమానులతో పంచుకుంటానని చెప్పుకొచ్చారు.

‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.