ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ప్రయత్నాలకు రజనీకాంత్ ఇక పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఇవాళా, రేపు అంటూ .. ఇంతకాలం ఊరించిన రజనీకాంత్ .. ఇక రాజకీయాలు నావల్ల కాదని తేల్చేశారు. ఆరోగ్య కారణాల వల్ల ఇప్పట్లో పార్టీ పెట్టలేనని రాజకీయాలతో సంబంధం లేకుండానే ప్రజలకు సేవ చేస్తానని రజనీ తన మూడు పేజీల లెటర్‌లో చెప్పారు.
ఇక రజనీ రాజకీయాల చాఫ్టర్ ముగిసినట్టే. గత పాతికేళ్లుగా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. అంతేకాదు డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు. దీంతో రజినీకాంత్ అభిమానులు లుండీ డాన్స్ తో ఊగిపోయారు. పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకున్న రజినీకాంత్‌కు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన తన రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ ప్రకటంచి మరోసారి సంచలనం సృష్టించాడు.
తమిళనాట విపరీతమైన ప్రజాదరణ ఉన్న హీరో కావడంతో ఈ అభిమానాన్ని పొలిటికల్‌గా క్యాష్ చేసుకోవాలని, రజనీ బృందం ప్రయత్నించింది. కానీ రాజకీయాలకు రజనీ నో చెప్పడంతో తమిళ్ పొలిటికల్ స్క్రీన్ పై హీరో విజయ్ పేరు వచ్చింది. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనీ స్వామిని విజయ్ రహస్యంగా కలిశారు. ఈ నెల 31న పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. జయలలిత సమాధి దగ్గర ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ,అళగిరి పార్టీతో డీఎంకే ఓటు బ్యాంక్ చీల్చేలా స్కెచ్ వేస్తున్నట్టు చెబుతున్నారు.