KV Anand: హిట్ సినిమాల దర్శకుడు గుండెపోటుతో మృతి

Tamil director KV Anand passes away

KV Anand: తమిళ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ప్రముఖ నటుడు వివేక్ గుండెపోటుతో కన్నుమూయగా రెండు రోజుల క్రితం దర్శకుడు తమిర కరోనాతో మరణించారు. వారి మరణాలను మరువకముందే మరొక ప్రముఖ దర్శకుడు కెవి. ఆనంద్ మరణించడంతో కోలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.

Tamil director KV Anand passes away
Tamil director KV Anand passes away

జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కెవి ఆనంద్ సినిమాటోగ్రాఫర్ అయ్యారు. పిసి శ్రీరామ్ వద్ద పనిచేసి పలు సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ పొందారు. ఆ తరవాత దర్శకులయ్యారు. ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఎక్కువగా సూర్యతో సినిమాలు చేశారు. సూర్య, కెవి ఆనంద్ కాంబినేషన్లో ‘అయాన్, మాట్రన్, కప్పన్’ లాంటి సినిమాలు చేశారు వీరిద్దరూ.

నిన్న శుక్రవారం గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఈయన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన మరణంతో తమిళ సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం కలిగిన హీరో సూర్య అయితే తల్లడిల్లిపోతున్నారు.