Home News వేదిక‌పై నిధి అగ‌ర్వాల్‌ని ఇబ్బంది పెట్టిన ద‌ర్శ‌కుడు.. మండిప‌డ్డ నెటిజ‌న్స్

వేదిక‌పై నిధి అగ‌ర్వాల్‌ని ఇబ్బంది పెట్టిన ద‌ర్శ‌కుడు.. మండిప‌డ్డ నెటిజ‌న్స్

బెంగ‌ళూరు బ్యూటీ నిధి అగ‌ర్వాల్ షార్ట్ టైంలో అశేష అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకుంది. న‌ట‌న‌తో పాటు త‌న గ్లామ‌ర్‌ని జోడించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన నిధి అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం తెలుగులో గ‌ల్లా అశోక్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తుంది. త‌మిళంలో శింబు హీరోగా తెర‌కెక్కుతున్న ఈశ్వ‌ర‌న్ మూవీలో న‌టిస్తుంది. ఈ మూవీ నిధి అగ‌ర్వాల్‌కు డెబ్యూ మూవీ కాగా, ఈ సినిమ‌తో హాట్ బ్యూటీ క్రేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం అంటున్నారు.

Ni | Telugu Rajyam

ఈశ్వ‌ర‌న్ చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుండ‌గా, రీసెంట్‌గా చిత్ర ఆడియో వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిధి అగ‌ర్వాల్ మాట్లాడుతుండ‌గా, ద‌ర్శకుడు సుశీంద్ర‌న్ ప‌దే అడ్డుప‌డుతూ వ‌చ్చాడు. సింబు మామ ఐ ల‌వ్యు అని చెప్పు అంటూ ప‌లుమార్లు ఆమెను ఫోర్స్ చేశాడు. దీంతో నిధి అగ‌ర్వాల్ కాస్త ఇబ్బందికి గురైన‌ట్టు క‌నిపించింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో నెటిజ‌న్స్ సుశీంద్ర‌న్‌ని తెగ ట్రోల్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు.

సినిమాలో శింబును ఉద్దేశించిమామా ఐ ల‌వ్యూ అని నిధి చెప్పే డైలాగ్ ఒక‌టి ఉంటుంది. ఆ డైలాగ్ చెప్ప‌మ‌ని నేను ప్రోత్స‌హించానే త‌ప్ప ఆమెను ఇబ్బంది పెట్ట‌లేద‌ని వివర‌ణ ఇచ్చాడు. ఈశ్వ‌ర‌న్ చిత్రం శింబు హీరోగా ఓ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీలోనూ విడుదల కానుంది. ఈ సినిమా కోసం శింబు 101 కేజీల నుండి 71 కేజీల వ‌ర‌కు త‌గ్గాడ‌ట. త‌న‌లోని మార్పు త‌న‌కే షాకిచ్చింద‌ని అంటున్నాడు ఈ త‌మిళ హీరో.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

Latest News