‘సూపర్’ ఛాన్స్ కొట్టేసిన సుశాంత్ హీరోయిన్ నిజమేనా.?

 

‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. మోడలింగ్ రంగం నుంచి వచ్చి హీరోయిన్‌గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగునాట బాగానే ఆహ్వానాలు అందుతున్నట్లున్నాయి. సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సినిమా హిట్టా.? ఫట్టా.? అనే సంగతి పక్కన పెడితే, హీరోయిన్‌గా మీనాక్షి పాత్రకు సినిమా చూసిన ఆడియన్స్ నుండి మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. పెద్దగా వంకలు పెట్టడానికేం లేదు.

కాగా, ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ ‘సూపర్’ ఛాన్స్ కొట్టేసిందంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అమ్మడికి ఛాన్స్ దక్కిందంటూ ప్రచారం జరుగుతోంది. మాంచి ఒడ్డూ పొడుగూ ఉన్న కటౌట్ కావడంతో, మహేష్ బాబు దృష్టిలో పడిందట ఈ ముద్దుగుమ్మ. ఆల్రెడీ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్దేను ఎంచుకున్నారు. కాగా, సెకండ్ హీరోయిన్ రోల్ కోసం మీనాక్షి పేరు పరిశీలనకొచ్చిందట. ఒకవేళ అదే నిజమైతే అమ్మడి దశ తిరిగినట్లే.

మరోవైపు మాస్ రాజా రవితేజ సినిమాలోనూ మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తోంది. అయితే, వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ ఏ సినిమాలో మీనాక్షి చౌదరికి ఛాన్స్ ఇచ్చాడా.? అన్న విషయం తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.