Suriya Pan India Movie: సూర్య నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘ఈటీ’

Suriya Pan India Movie: సూర్య.. కోలీవుడ్ హీరోనే అయినా టాలీవుడ్ హీరోలతో సరి సమానంగా తెలుగు అభిమానులని సంపాదించుకున్న విలక్షణ నటుడు. ఇటీవలే విడుదల అయిన ‘జై భీమ్’ చిత్రం ఓటీటీ లో విడుదల అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. సౌత్ ఇండియా భాషల్లోనే కాదు.. హిందీ అనువాదంలోనూ మంచి విజయం సాధించింది. దీంతో సూర్య మూవీలను ఇక నుండి పాన్ ఇండియా మూవీల్లాగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ‘ఈటీ’ (ఎతర్ క్కుమ్ తునిందవన్). సన్ పిక్టర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ చిత్రాన్నిఐదు భాషల్లో (తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ) తెరకెక్కించనున్నారు. ఈ మేరకు సినిమా పోస్టర్ ను సోషల్ వేదికగా పంచుకున్నారు చిత్రబృందం.

ఈ చిత్రంలో సూర్యకి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నది. ఈ సినిమాకు డి ఇమ్మాన్ బాణీలు సమకూర్చనున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య కి ఇది రెండో సినిమా. ఇది వరకే వీరి కాంబినేషన్ లో పసంగా -2 : హైకూ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో మేముగా విడుదల అయ్యింది.