Suriya ET – Official Telugu Teaser : సూర్య ‘ఈటీ’ టీజర్ చూశారా?

Suriya ET – Official Telugu Teaser : కోలీవుడ్ స్టార్ సూర్య లేటెస్ట్ మూవీ టీజర్ వచ్చేసింది.. . తమిళంలో నటించిన తాజా చిత్రం ‘ఎత్తారుక్కుమ్ తునింధవన్‌’, అంటే దేనికైనా తెగించే వాడు అని అర్ధం – ఇది తెలుగులో ‘ఈటీ’ గా వస్తోంది  మార్చి 10 న. ఈ సందర్భంగా పానిండియా టీజర్ రిలీజ్ చేశారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియెంటెడ్ గా వున్న టీజర్, లుంగీ కట్టుకున్న సూర్య  యాక్షన్,  రోమాన్స్, సాంగ్స్ తో ఈలలు పడేలా వుంది.

ఎందుకో జైల్లో వున్న సూర్య, బయటికొచ్చి స్టయిలిష్ విలన్ వినయ్ రాయ్ అంతు చూసే దృశ్యాలు టీజర్ లో వున్నాయి- ‘నాతో వుండే వాళ్ళెప్పుడూ భయపడకూడదు, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు’ అంటూ మాస్ డైలాగ్స్ కొట్టి, యాక్షన్లో దిగుతాడు సూర్య.

ET - Official Teaser (Telugu) | Suriya | Sun Pictures | Pandiraj | D.Imman | Priyanka Arul Mohan

 

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సూర్య చేసే పోరాటంగా ఈ మూవీ వుంటుంది. కరోనా టైమ్ లో ఓటీటీలో ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ హిట్స్ తర్వాత ఇప్పుడు ‘ఈటీ’ నేరుగా థియేటర్లలో విడుదల కాబోతోంది. తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్ పిక్చర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో సూర్యకి జంటగా ప్రియాంకా అరుళ్  మోహన్ నటిస్తోంది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి డి. ఇమ్మాన్ సంగీతం అందించాడు. కెమెరా ఆర్ రత్నం. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ కి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది.

ఇంతే గాక ఈ సినిమాకి సూర్య తెలుగు డబ్బింగ్ తానే చెప్పుకోవడం విశేషం. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో ఏసియన్‌ సినిమాస్‌ విడుదల చేస్తోంది.