సురేష్ బాబు.. నిర్మాతగా, డీస్ట్రీబ్యూటర్ గా పూర్తిస్థాయిలో సక్సెస్ అయిన వ్యక్తి. రామానాయుడు స్టూడియోస్ పేరుతో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించారు ఆయన. అయితే ఈమధ్యకాలంలో సినిమాల నిర్మాణం మీద, స్టూడియో, థియేటర్ల నిర్వహణ మీద ఆయన పెద్ద సంతృప్తిగా లేరు. ఓటీటీల హవా ఎక్కువ కావడం, కరోనా తెచ్చిన ఇబ్బందుల కారణంగా సినిమాల నిర్మాణం చాలా కష్టమైందని, ప్రేక్షకుల అభిరుచి మారిందని, అంతంత పెట్టి చిత్రాలు చేయడం రిస్క్ అవుతోందని పలుమార్లు అన్నారు కూడ. అందుకే ఆయన సినిమా వ్యాపారంలో కొత్త దారులు వెతుకుతున్నారు.
అదే మ్యూజిక్ లేబుల్. ఇప్పటివరకు ఆడియో రంగంలో ఆదిత్య మ్యూజిక్ సంస్థదే అగ్రస్థానం. ఆడియో రైట్స్ కొనడం, పాటల వీడియో హక్కులు దక్కించుకుని యూట్యూబ్ ద్వారా బిజినెస్ చేయడం ఆదిత్య మ్యూజిక్ వారి పని. దీని ద్వారా వారు బాగానే గడించారు. ఇప్పుడు సురేష్ బాబు కూడ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఎస్పీ మ్యూజిక్ పేరుతో త్వరలో లేబుల్ లాంఛ్ చేస్తారట. బిజినెస్ పట్టుకోవడం సురేష్ బాబుకి పెద్ద సమస్య కానే కాదు. అనుకుంటే ఒకేసారి పది పెద్ద సినిమాల మ్యూజిక్ రైట్స్ కొనగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ మ్యూజిక్ రంగంలో ఆయన చాలా త్వరగానే వేళ్లూనుకుని పొగలరు.