Suresh Babu: నిర్మాత సురేష్ బాబు అంటే ఇండస్ట్రీలో ఒక వ్యాల్యూ ఉంది. ఆయన వారసుడిగా వచ్చిన రానా దగ్గుబాటి క్రమశిక్షణతోనే నడుచుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. రానా మీద ఏనాడూ ఏ వివాదమూ వచ్చింది లేదు. కానీ సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ ఆదిలోనే అపవాదును నెత్తిన వేసుకున్నాడు.
తనను అభిరామ్ వాడుకున్నాడు అంటూ ఒక నటి మొదలుపెట్టిన వివాదం ఎంతవరకు వెళ్లిందో అందరికీ తెలుసు. ఆ వివాదంతో అభిరామ్ వెండితెర మీదకు ఎంట్రీ ఇవ్వకుండానే నెగెటివిటీ బారిన పడాల్సి వచ్చింది. దీంతో సురేష్ బాబు అభిరామ్ ఎంట్రీని అనుకున్న దానికంటే ఆలస్యం చేయాల్సి వచ్చింది. అన్నీ బాగుంటే అభిరామ్ ఈపాటికే హీరోగా రావాల్సింది. కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు ఆ పనులు స్టార్ట్ చేశారు సురేష్ బాబు. అందుకే అభిరామ్ ను జనంలో బుద్ధిమంతుడిగా ప్రొజెక్ట్ చేసే పని పెట్టుకున్నారు.
కరోనా చికిత్సలు చేస్తున్న వైద్యుల కోసం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోస్ నందు ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేశారు సురేష్ బాబు. ప్రస్తుత విపత్కర సమయంలో ఇలాంటి చర్య చాలా మంచిదే. ఆ భాద్యతలను ఆయన అభిరామ్ భుజాన వేశారట. అభిరామ్ పేరు గట్టిగా వినబడేలా చేస్తున్నారు. అభిరామ్ సైతం తండ్రి చెప్పినట్టే చేస్తున్నారట. మొత్తానికి కుమారుడి కెరీర్ రిపేర్ చేయడానికి సురేష్ బాబు బలంగా ట్రై చేసున్నారు.