సురేష్ బాబుకు భారీ లాభాలను తెచ్చి పెట్టిన వెంకటేష్

Suresh Babu bags good profits with Narappa, Drushyam -2
Suresh Babu bags good profits with Narappa, Drushyam -2
విక్టరీ వెంకటేష్ చేసిన రెండు కొత్త సినిమాలు నారప్ప, దృశ్యం-2.  ఈ రెండూ కూడ రీమేక్ చిత్రాలే.  ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్లను చాలామంది ప్రేక్షకులు చూసేశారు. పైగా సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేదు.  ఈ పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ అంటే జూదమనే అనాలి.  ఇప్పటికే చూసేశాం కదా ఈ కరోనా టైంలో రిస్క్ చేసి థియేటర్లకు వెళ్లడం అవసరమా అని ప్రేక్షకులు అనుకుంటే మొదటికే మోసం వస్తుంది.  వెంకటేష్ అభిమానులు ఆయన కోసం సినిమా హాళ్లకు వచ్చినా భారీ వసూళ్లు వస్తాయన్న నమ్మకం లేదు.  అందుకే నిర్మాత సురేష్ బాబు సేఫ్ గేమ్ ఆడారు. 
 
తెలుగులో పెద్ద హీరో కాబట్టి ఓటీటీ సంస్థలు ఈ రెండు సినిమాలను కొనుగొలిచేయడానికి ఆసక్తి చూపాయి.  అమెజాన్ సంస్థకు నారప్పను విక్రయించేశారు.  కేవలం డిజిటల్, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ద్వారానే ఈ చిత్రానికి 40 కోట్ల డీల్ దక్కిందట.  ఇక శాటిలైట్ రైట్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి.  ఇది నిర్మాతకు అదనపు లాభాల్ని ఇస్తుంది.  ఇక దృశ్యం-2 కు అలాంటి డీల్ సెట్ చేశారట సురేష్ బాబు.  సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, డిజిటల్, శాటిలైట్ హక్కులను 35 కోట్ల వరకు అమ్మారట.  సో రెండు సినిమాలు కలిపి సురేష్ బాబు చేసిన బిజినెస్ 75 కోట్ల వరకు ఉంటుంది.  ఈ రెండు సినిమాల్లో దృశ్యం-2 నిర్మాణ వ్యయం చాలా తక్కువే.  కాబట్టి సురేష్ బాబుకి మంచి లాభాలే ముట్టి ఉంటాయి.