తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా దృష్ట్యా బాణసంచా అమ్మకాలు, కాల్చడాలను నిషేధిస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా దీపావళి సందర్భంగా క్రాకర్స్ అమ్మకాలు, కాల్చడం లాంటివి జరగడకుండా చూసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో… తెలంగాణ ఫైర్ వర్క్స్ అసోసియేషన్.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దానిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు… తెలంగాణ బాణసంచా వ్యాపారులకు ఊరటను కలిగించింది. గ్రీన్ క్రాకర్స్ కు తెలంగాణలో అనుమతిస్తున్నట్టు పేర్కొంది. హైకోర్టు నిషేధంపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో తెలంగాణ వ్యాప్తంగా క్రాకర్స్ వ్యాపారులు సంబురాలు చేసుకుంటున్నారు. వెంటనే తమ షాపులను ఓపెన్ చేసి.. క్రాకర్స్ బిజినెస్ ను ప్రారంభించారు.