ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. ఇప్పటి వరకు విడుదలైన రెండు ప్రోమోలు – ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి. మునుపెన్నడూ చూడని యాక్షన్ కంటెంట్, నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించడం సినిమాపై క్యురియాసిటీని పెంచింది. ఇప్పుడు ఆ అంచనాలని రెట్టింపు చేస్తూ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలైయింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను విడుదల చేసి, టీమ్‌కు బెస్ట్ విశేష్ తెలిపారు.

ట్రైలర్ ప్రధాన పాత్రలని పరిచయం చేయడంతో పాటు కథాంశంపై క్యురియాసిటీని కలిగించింది.ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ (నాగార్జున) గ్యాంగ్‌స్టర్ల నుండి ముప్పు ఉన్న తన చెల్లలు మేనకోడలను సంరక్షిస్తానని తండ్రికి మాట ఇస్తాడు. కథాంశం, కథనం రెండూ ఆసక్తికరంగా వున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కనెక్ట్ తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా వుంది. ప్రవీణ్ సత్తారు అందరినీ ఆకర్షించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో అతని స్టైలిష్ టేకింగ్ రోలర్‌కోస్టర్ రైడ్‌ను అందిస్తోంది.

నాగార్జున తన ఫెరోసియాస్ యాక్ట్ తో ఏజెంట్ విక్రమ్‌గా పవర్-ప్యాక్డ్ ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ట్రెండీ ఎటైర్ పాటు సూట్‌లు, యూనిఫామ్‌లో కూడా తనదైన ఫ్యాషన్ తో అలరించారు.నాగార్జున సబార్డినేట్‌గా కనిపించిన సోనాల్ చౌహాన్ గ్లామర్ విందు పంచారు. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్ నటిస్తుండగా, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ కనిపించింది. ట్రైలర్‌లో ది ఘోస్ట్ తన ప్రధాన ఆయుధం తమహగనే వాడినట్లు చూపించారు.

ట్రైలర్ లో ప్రతి బిట్ గ్రిప్పింగ్, యాక్షన్-ప్యాక్డ్ గా మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తుంది. ఒక సీరియస్ మిషన్‌లో వున్న నాగార్జున పలికిన డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా వున్నాయి. ఇప్పటివరకూ వున్న అంచనాలని ఈ ట్రైలర్ రెట్టింపు చేసింది.

ప్రొడక్షన్ డిజైన్ లావిష్ గా వుంది. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ ,భరత్-సౌరబ్ రీ-రికార్డింగ్ , షార్ప్ ఎడిటింగ్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు.

చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు కాగ, భరత్, సౌరబ్ ద్వయం పాటలు అందించారు. బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

సాంకేతిక విభాగం
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ – సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ