భలే ‘రొమాంటిక్’ ఛాన్సులే.!

కరోనా ప్యాండమిక్ తర్వాత ఈ మధ్యనే ధియేటర్లు కళకళలాడుతున్నాయి. ఏపీలో కూడా ఈ మధ్యనే ఫుల్ పర్మిషన్ దక్కింది. ఈ తరుణంలో ‘రొమాంటిక్’ సినిమా స్పెషల్ టాక్‌గా నిలిచింది. ఆకాష్ పూరీ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి, హిట్ లిస్టులో తన సినిమాని జాయిన్ చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాడు.

ఇకపోతే, ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ముందుగా సాగుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ యూత్‌కి బాగా కనెక్ట్ అవ్వడంతో, సినిమా టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడంలోనూ సక్సెస్ అవ్వడం పక్కా అని చిత్రయూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

పాటలు వినసొంపుగా ఉండడంతో పాటు, యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. విజువల్ కూడా అదిరిపోయిందని ఇన్‌సైడ్ టాక్. ఇకపోతే, ఈ సినిమాకి హీరోయిన్ కేతికా శర్మ గ్లామర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. అలాగే, సీనియర్ నటి రమ్యకృష్ణ పాత్ర డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తోంది ఈ సినిమాలో.

పూరీ జగన్నాధ్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ‘రొమాంటిక్’ ‌కి అనిల్ పాడూరి దర్శకుడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో పూరీ, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 29న ‘రొమాంటిక్’ ధియేటర్‌లో సందడి చేయనుంది.